ప్రజాశక్తి-అరకులోయ:అరకులోయలో మూడు రోజులపాటు నిర్వహించిన అరుకు చలి ఉత్సవ్ ఉత్సాహంగా ఆదివారం ముగిసింది.కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో పాడేరు ఐటిడిఏ పిఓ అభిషేక్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, సబ్ కలెక్టర్ శౌర్యమని పటేల్ ఉత్సవ్ విజయవంతనికి కృషి చేశారు. ఉత్సవ్ సందర్భంగా నిర్వహించిన వివిధ రాష్ట్రాల కళాకారుల కార్యక్రమాలు అలరింపజేశాయి.జానపద గీతాలు, సినీ గీతాలు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించి అందర్నీ ఆకర్షించారు. నిత్యం బిజీగా ఉండే ఐఏఎస్ అధికారులు అరకు ఉత్సవంలో స్టెప్పులు వేయడంతో పర్యాటకులు స్థానికులు గిరిజనులు ఆశక్తిగా తిలకించారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో అరకు చలి ఉత్సవ్ నిర్వహించడంతో ఉత్సవం తిలకించడానికి వెళ్లేవారు కొంత ఇబ్బందులు పడ్డారు. అరకు లోయ టౌన్ షిప్ లో ఉత్సవ సందడి కనిపించకపోవడంతో స్థానికుల్లో కొంత అసంతృప్తి కలిగించినప్పటికీ, ఉత్సవ ప్రాంగణ మైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ఊహించని విధంగా జన సందోహంతో నిండిపోయింది. ఈ ఉత్సవంలో హెలికాప్టర్ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచినప్పటికీ అధిక రేట్లు వసూలు చేయడంతో అందరూ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పద్మాపురంలో నిర్వహించిన షో కూడా ఆశించినంతగా లేక వీక్షకులను నిరాశపరిచింది. చలి ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రధాన కూడలిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరకు చలి ఉత్సవ్ సందర్భంగా ముగింపు రోజు ఆదివారం రాత్రి వివిధ సంస్కతిక కార్యక్రమాలు ఉత్తేజపరితంగా ముగిసింది. ఉత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం సుంకరమెట్ట కాపీ ప్లాంటేషన్ ఓపి అగర్వాల్ బృందం ట్రేకింగ్ నిర్వహించారు. అలాగే గిరిజన సంస్కతిక మ్యూజియంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా కలెక్టర్, అధికారులు తిలకించారు. అనంతరం సాయంత్రం యధావిధిగా వివిధ సంస్కతిక ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీ విజయ భాస్కర్ తాల వైద్యం, పాశ్చాత్య గానం -నృత్యాలు, షాడో నృత్యం, జానపద పాటలు,ఆర్కెస్ట్రా, మైండ్ రీడింగ్ మెంటలిస్ట్ ప్రదర్శన, లేజర్ షో వంటి వినోద కార్యక్రమాలు అందరిని కనువిందు చేశాయి. చలి ఉత్సవ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐఏఎస్ అధికారులు బహుమతులు, మెమొంటోలు ప్రధానం చేశారు.ట్రెక్కింగ్‌తో జోష్‌పర్యాటకులలో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ధైర్యాన్ని నింపటానికి ఏర్పాటుచేసిన ట్రక్కింగ్‌లో పలువురు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం సుంకర మెట్ట కాఫీ ట్రయల్ నుండి సుమారు మూడు కిలోమీటర్లు ట్రక్కింగ్ చేసి పర్యాటకులలో ధైర్యాన్ని నింపారు. ట్రెక్కిింగ్ కు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓపి అగర్వాల్ బృందం సపోర్ట్ చేసింది.విశాఖపట్నం జిల్లా జడ్జి ఎం గిరిధర్, డివిజనల్ ఫారెస్ట్ అధికారి సందీప్ రెడ్డి, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం క్యూరేటర్ పి శంకర్రావు, తదితరుల ఆధ్వర్యంలో ట్రెక్కింగ్ సజావుగా సాగింది. ట్రక్కింగ్‌లో పాల్గొన్నవారు రకరకాల పక్షుల కూతలు, పలురకాల మొక్కల సువాసనలు, స్వచ్ఛమైన గాలి, వివిధ రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఫీల్ పొందామని, ప్రకృతి ఒడిలో మై మర్చిపోయామని ఎంతో పరవశం తో చెప్పారు.ప్రత్యేక ఆకర్షణగా ముగ్గుల పోటీలుఅరకు చలి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. పాలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎంతో ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. పలువురు మహిళ అధికారులు కూడా ఈ ముగ్గుల పోటీలలో పాల్గొని అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ పోటీలలో మొదటి బహుమతి బి.దేవి, రెండవ బహుమతి ఎల్.మధు శ్రీ, మూడవ బహుమతి యు.సునీత సాధించగా మూడేళ్ల చిన్నారి చిన్మయి పోటీలు పాల్గొని అందర్నీ ఆకర్షించడంతో ఆమెకు కన్సోలేషన్ బహుమతిని అందజేశారు.విజేతలకు బహుమతులు అందజేసిన జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించిందని, స్థానికులే కాకుండా పర్యాటకులు కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొనడం గొప్ప విషయమని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎఎస్‌ఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ ఎంజె అభిషేక్ గౌడ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి విభిషేక్, డిఆర్‌ఓ పద్మలత పాల్గొన్నారు.
