ప్రజాశక్తి- అరకులోయ:చలి అరకు ఉత్సవం పండగ వాతావరణంలో ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అరకు రైల్వే స్టేషన్ నుండి 5 కె రన్ ప్రారంభించారు. అరకు చలి ఉత్సవ్ వేదికగా నిర్వహించిన వివిధ సంస్కతిక కార్యక్రమాలు అల్లరింప జేశాయి. ఉత్సవ వేదికలో జబర్దస్త్ ప్రోగ్రాంల తోపాటు, వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. విజయవాడ నుంచి కర్ర నృత్యం, దంతేవాడ జిల్లా బస్టార్ బ్యాండ్, చంపి గిరిజన దింస నృత్యం, శ్రీకాకుళం జిల్లా ఏచర్ల తప్పెటగుళ్ళు, మధ్యప్రదేశ్ కుటుంబ బాధ నేర్జ్, సాగర్వలస మయూరి బ్యాండ్ బాజా, చింతూరు ఐటిడిఏ కొమ్ము డాన్స్, పార్వతీపురం నందికొత్తల డాన్స్, విజయనగరం జిల్లా బంగర వలస జమ్ముల కల కథ, విజయనగరం జిల్లా శ్రీ రామ చెక్కభజన, తమిళ నాడు ఊటీ తోడ డాన్స్ వంటి కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి, కలేక్టర్, ఐటిడిఏ పివో డాన్స్ వేసి ఆకర్షణ గా నిలిచారు. ఉత్సవేదికలో పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ గీతాలపన చేసి అలరింపజేశారు. ఒకే వేదికలో 8 రాష్ట్రాల వివిధ ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రాంగణమంతా హర్ష ధ్వనులతో కేరింతలు కొట్టారు. ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ లు చూపర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవ ప్రాంగణంలోని ఫుడ్ కోర్టులో అరకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వివిధ సంప్రదాయ గిరిజన వంటకాలు అందరి దృష్టిని ఆకర్షించింది. అదేవిధంగా అంగన్వాడి కార్యకర్తలు ఆదివాసి వస్త్రధారణతో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.అంతకుముందు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తో పాటు, పాడేరు ఐటిడిఏ పిఓ, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్లతో పాటు, మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పట్టాసి, చలపతిరావు ప్రముఖ వ్యాపారవేత్త మయూరి రాజారావు సందర్శించారు, గిరిజన మ్యూజియం గోడలపై కలెక్టర్ ఇతర ఐఏఎస్ అధికారులు డ్రాయింగ్ వేసి అందరినీ ఆకర్షించారు. ఉత్సవ సందర్భంగా అరకులోయ వేదికగా నిర్వహించిన హెలికాప్టర్ రైడ్ అందర్నీ అలరింప చేసింది. 5కే రన్‌లో 300 మంది పాల్గొన్నారు. పురుషుల విభాగంలో వి రమేష్, (గన్నెల) ప్రథమ స్థానం, డి అభిషేక్ (కిన్నంగూడ), ద్వితీయ స్థానం, సామ్యూల్ (మజ్జీవలస) తృతీయ స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో సెకండ్ స్టాండర్డ్ విద్యార్థిని జీవన (లిట్టిగూడ), ఎస్ మంజుల ద్వితీయ స్థానంలో నిలిచారు. అనంతరం విజేతలకు జిల్లా కలెక్టర్ బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం జె అభిషేక్ గౌడ, ఐటిడిఏ పిఓ వి .అభిషేక్, సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, ఏఎస్పీ ధీరజ్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జగన్మోహనరావు, విద్యార్థులు, మహిళలు, పర్యాటకులు పాల్గొన్నారు.ఫ్లవర్ ఎగ్జిబిషన్ షో ప్రారంభంఅరకులోయ రూరల్:అరకు ఉత్సవాలలో భాగంగా పద్మాపురం బొటానికల్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ప్లవర్ షో ను శుక్రవారం చింతరు పిఓ అపూర్వ భారత్, రంపచోడవరం ఐటిడిఏ పీఓ కోట సింహాచలం కలిసి ఘనంగా ప్రారంబించారు. అనంతరం వివిధ ప్లవర్‌లతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ తిలకించారు. గార్డెన్లో పూలు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ గౌడ్, పాడేరు ఐటిడిఏ పీఓ వి.అభిషేక్, ఎగ్జిబిషన్ నిర్వాహకులు రజినీ, పద్మాపురం గార్డెన్ మేనేజర్, ఎల్ బొంజుబాబు, తదితరులు పాల్గొన్నారు.
