లబ్ధిదారుల ఆందోళన

ఆందోళన చేపడుతున్న లబ్ధిదారులు

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌: ఏప్రిల్‌, మే నెలకు సంబంధించి రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని మండలంలోని లోతేరు పంచాయతీ తోడుబంధ, కురిసేల గ్రామాల లబ్ధిదారులు గ్రామ సచివాలయం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. రెండు గ్రామాలు కలిపి 70 రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, అలాంటిది అసలు బియ్యమే పంపిణీ చేయక పోతే తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ నెల ఏదో ఒక్క గ్రామానికీ కోత పెడుతూనే ఉన్నారని తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో సేల్స్‌ మెన్‌, డీలర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు సార్లు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు కె.త్రినాథ్‌, బిమిడి అప్పలస్వామి, బాబురావు, గంగాధర్‌, జగన్నాధం, తదితరులు పాల్గొన్నారు.

➡️