యోగాతో మెరుగైన ఆరోగ్యం

యోగా చేస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు : యోగాసనాలు ఆచరించ డంతో మానసికంగా, శారీరకంగా దృడంగా ఉంటామని జిల్లా కలెక్టర్‌ ఎ.ఎస్‌. దినేష్‌ కుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక కెజిబి పాఠశాలలో యోగా గురు పతంజిలి శ్రీనివాస్‌ నిర్వహించిన యోగా శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హుకుంపేట, పాడేరు, జి.మాడుగుల మండలాల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు ముందుగా నిర్వహిస్తామన్నారు. యోగాతో ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

➡️