ప్రజాశక్తి- అరకులోయ:పర్యాటక కేంద్రమైన అరకులోయలో బుధవారం పర్యాటకుల సందడి నెలకొంది. మునుపెన్నడు లేనివిధంగా పర్యాటకుల తాకిడి పెరిగింది. అరకు ప్రాంతంలోని పర్యాటక సందర్శిత పద్మావతి ఉద్యానవన కేంద్రం, గిరిజన మ్యూజియం కిటకిట లడాయి. మరమ్మతుల నిమిత్తం మూసివేసిన గార్డెన్ తీర్చుకోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో, అరకులో గిరిజన సంస్కతిక మ్యూజియం, కాపీ మ్యూజియం చాక్లెట్ ఫ్యాక్టరీ కిటకిటలాడుతున్నాయి. పర్యాటకుల తాకిడితో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.పర్యాటకుల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ జాం ఘాట్రోడ్లో ఏర్పడుతున్న దృష్ట్యా ఇప్పటికే కాపీ తోటలోని ఉడెన్ బ్రిడ్జి మూసివేసిన విషయం తెలిసిందే.
