ప్రజాశక్తి – అరకులోయ రూరల్:గిరిజన ప్రాంతం లో గిరిజనేతరులు పెట్టుబడులు పెట్టేందుకు 1/70 చట్టం ఆటంకంగా ఉందని, గిరిజన చట్టాలను సడలించాలని స్పీకర్ అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై ఈనెల 11,12 తేదీలలో తలపెట్టిన మన్యం బంద్ విజయవంతం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర పిలుపునిచ్చారు. ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం అరకులోయలోని డిగ్రీ కళాశాల నుండి అరకు వరకు ఆదివాసి అఖిలపక్ష ప్రజాసంఘాలు, రాజాకీయ పార్టీలు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి 1/70 చట్టం పై తమ వైఖరి ఏంటో స్వష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పర్యాటక ప్రదేశాలు బొర్రా అరకు, లంబసింగ్ వచ్చే పర్యాటకులు ఈ రెండు రోజులు చేపడుతున్న బందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు, పెదలబుడు ఎంపీటీసీ దురియా ఆనంద్, డిఎల్‌ఓ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర ప్రసన్నకుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాచిపెంట చిన్నస్వామి, ఆదివాసి పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు చట్టు మోహన్, ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి జి బుజ్జిబాబు, సిపిఎం మండల కార్యదర్శి కె రామారావు, ఆదివాసి గిరిజన సంఘం నేతలు పి రామన్న, కె బుజ్జిబాబు, కొర్ర మగ్గన్న, కిల్లో జగన్నాథం, కిల్లో సహదేవ్, పి.నానిబాబు, గురుమూర్తి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఐసుబాబు తదితరులు పాల్గొన్నారు. అరకులోయ రూరల్:1/70 చట్టం సవరణ చేయాలని స్పీకర్ చింతకాయల ఆయన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలని అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు డిమాండ్ చేశారు. అనంతగిరి మండలం బొర్ర గృహాల నుండి డముకు జంక్షన్ వరకు బైక్ ర్యాలీతో ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా అనంతగిరి జెడ్పిటిసి గంగరాజు మాట్లాడుతూ, 1/70 చట్టం జోలికొస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో టోకురు సర్పంచ్ కిల్లో మోస్య, సిపిఎం మండల నాయకుడు సోమెల నాగులు, వేంగడ మాజీ సర్పంచ్ సివేరి కొండలరావు, గెమ్మెల దేవన్న, వంతల బుద్రయ్య, గెమ్మెల భీమరాజు, కిల్లో స్వామి పాల్గొన్నారు.ముంచింగిపుట్టు : మండల కేంద్రంలో నేడు, రేపు నిర్వహించే 48 గంటల బంద్‌తో కూటమి ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని ఆదివాసి గిరిజన సంఘం నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ వాహనదారులు సహకరించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు ఎంఎం శ్రీను, కార్యదర్శి నరసయ్య, జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొర్ర త్రినాథ్, గాసిరాం దొర, లైకొన్, పాల్గొన్నారు.పెదబయలు :బంద్‌ను జయప్రదం చేయాలని మండల కేంద్రంలోని వారపు సంతలో గిరిజన సంఘం, సిపిఎం, గిరిజన వినియోగ దారుల సంఘం నేతలు ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ప్రచారం చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు బొండా సన్నిబాబు, వైసిపి మండల అధ్యక్షులు మజ్జి చంద్రబాబు, సందడి కొండబాబు, పీసా కమిటీ రోగులుపేట కార్యదర్శి జంబు దేవరాజు, గిరిజన సంఘం మండల అధ్యక్షులు బొండా గంగాధరం, బీఎస్పీ మండల నాయకులు లోచలి భగీరధి మోహన్, గలగండ సర్పంచ్ పూజారి లోహిదాసు తదితరులు పాల్గొన్నారు. డంబ్రిగుడ: 1/70 భూ బదలాయింపు చట్టాన్ని రద్దు చేయాలని చూస్తే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరిస్తూ సోమవారం మండలకేంద్రంలో గిరిజన సంఘం,సిపిఎం నాయకులు ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు.స్థానిక జూనియర్ కళాశాల నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి పోతురాజు మాట్లాడుతూ, ఆదివాసులకు కల్పించిన రాజ్యాంగ చట్టాలను, హక్కులను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ ు పాల్గొన్నారు.చింతపల్లి: మన్యం బంద్ కు జాతీయ రహదారి కార్మికులు సహకరించాలని అంతర్ల పీసా కమిటీ ఉపాధ్యక్ష కార్యదర్శులు గబులంగి నాగేశ్వరరావు, కవడం శివ సంతోష్ కోరారు. గిరిజన హక్కులు చట్టాలను ప్రభుత్వాలు కాలరాస్తే సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి గుత్తేదారుడు తిలక్‌ను కలిసి మన్యం బంద్ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కవడం ఈశ్వరరావు, అరడ ధర్మరాయుడు పాల్గొన్నారు.బంద్ జయప్రదానికై చింతపల్లిలో పైకి ర్యాలీ చేపడుతున్న అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు. చింతపల్లి :బంద్ జయప్రదం చేయాలని చింతపల్లిలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు స్థానిక డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీ చేపట్టారు. బంద్‌కు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్, చింతపల్లి జడ్పిటిసి పోతురాజు బాలయ్య, సిపిఎం మండల కార్యదర్శి. పాంగి ధనుంజరు, గిరిజన సంఘం మండల కార్యదర్శి. సాగిన చిరంజీవి, సిపిఐ మండల నాయకులు ఎర్రబొమ్మల ఎంపిటిసి. సెగ్గే సత్తిబాబు పాల్గొన్నారు.విఆర్.పురం :ఎపి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు ఈ నెల 11, 12 తేదీలలో జరిగే 48 గంటల ఏజెన్సీ మన్యం బంద్ విజయవంతం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు సోమవారం విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్ కుమార్, పోడియం. శ్రీరామ్మూర్తి, వేటగాని సూరి, సారా పాండురాజు, పూనెం కిరణ్, వైసిపి కార్యకర్తలు పిట్ట రామారావు, చిక్కాల బాలు, పోడియం సీతయ్య తదితరులు పాల్గొన్నారు.ఎటపాక : మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం, సిపిఎం నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. మండల కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు, పాఠశాలలు, బ్యాంకుల అధికారుల, సిబ్బంది, దుకాణాలదారులకు కరపత్రాలు పంపిణీ చేసి బంద్‌కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కాకా అర్జున్‌దొర, జిల్లా కమిటీ సభ్యులు ఐవి, మండల కమిటీ సభ్యులు పులుసు బాలకృష్ణ, జి.హరి, ఇరపా సత్యం, సోందే రామారావు, సవలం రాము, పొడియం రత్తమ్మ, సీఐటీయూ నాయకులు తోట శ్రీను, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు భీష్మ, సురేష్, ఆసు ప్రసాద్, కాకా వీరయ్య, సోయం పెదబాబు తదితరులు పాల్గొన్నారు.కొయ్యూరు : 48 గంటల ఏజెన్సీ మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని గిరిజన సంఘం జిల్లా నాయకుడు ఎస్ సూరిబాబు, జేఏసీ నాయకులు అధికారులకు, హౌటళ్ల నిర్వాహకులకు కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం చేశారు. గిరిజన సంఘం, అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.సీలేరు : మన్యం బందును జయప్రదం చేయాలని జికె.వీధి మండలం మంగళపాలెం క్లస్టర్ పీసా ఉపాధ్యక్షులు మచ్చల బాబురావు పిలుపునిచ్చారు. బంద్ గోడ పత్రికలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1/70 చట్టం రక్షణకే ఈ బంద్ జరుగుతుందని చెప్పారు. మన్యం బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, మేధావులు హాజకరించాలని కోరాఉ. ఈ కార్యక్రమంలో గిరిజనులు పాల్గొన్నారు. రాజవొమ్మంగి : ఈనెల 11 12 తేదీల్లో ఆదివాసీ సంఘం తలపెట్టిన మన్యం బందుకు యుటిఎఫ్ సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు ఆయా సంఘాల నాయకులు సోమవారం తెలిపారు. రాజవొమ్మంగిలో యుటిఎఫ్ మండల గౌరవ అధ్యక్షులు కారం రాంబాబు సమక్షంలో సోమవారం అత్యవసర కార్యవర్గ సమావేశం జరిగింది. పీవీ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, కానెం శ్రీను, సిఐటియు జిల్లా నాయకులు రామరాజు, యుటిఎఫ్ నాయకులు కానెం శ్రీను, కోడూరి లోవరాజు, ఆవూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మద్దతుఎంవిపి.కాలనీ : మంగళ, బుధవారాల్లో జరిగే మన్యం బంద్‌కు విశాఖపట్నం జిల్లా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఎంవిపి.కాలనీలోని గిరిజన్ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. 1/70 చట్టంపై స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు దారుణమైనవని పేర్కొంది. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కటారి శోభన్ కుమార్, గౌరవ అధ్యక్షులు భాక సత్యారావు, సలహాదారులు కిముడు రామారావు, కొక్కుల రామారావు, పిసిహెచ్.రామానాయుడు, బొండా తౌడన్న, ఒలేసి రామలింగం, సభ్యులు జన్ని రామన్న, డేపూరి పూజ్య శేఖర్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జివిఆర్.మూర్తి, అధ్యక్షులు కిముడు చిన్నంనాయుడు పాల్గొన్నారు.
