ప్రజాశక్తి-అరకులోయ రూరల్:రాష్ట్ర రవాణ, భవనముల శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ను సచివాలయ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏపీఎస్‌ఆర్టీసీ జోనల్ చైర్మన్లు రెడ్డి అప్పల నాయుడు, దోన్ను దొర, సురేష్ రెడ్డి, పోలా నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాష్ట్ర రవాణా యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిని సచివాలయంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా ఏపీఎస్‌ఆర్టీసీ జోన్ పరిధిలో నెల కొన్న సమస్యలపై చర్చించారు.
