చల్లబడిన మన్యం

Apr 4,2024 00:18
అరకులోయలో కురుస్తున్న వర్షం

ప్రజాశక్తి-అరకులోయ:పర్యాటక కేంద్రమైన అరకులోయలో బుధవారం మధ్యాహ్నం తొలకరి వాన కురిసింది. ఎండ తీవ్రతతో గిరిజనులు అల్లాడుతుండగా వాన కురవడంతో ఈ ప్రాంత వాసులు సేద తీరారు. ఇంతవరకు తీవ్రమైన ఎండ వేడిమితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మన్యప్రాంత వాసులకు తొలకరి వాన పలకరించడంతో ఈ ప్రాంతమంతా ఒక్కసారిగా చల్లబడింది. అరకులోయను సందర్శించే పర్యాటకులు సైతం ఆనందించారు. ఈ ఏడాది మునుపేన్నడు లేని విధంగా మామిడి పూత వచ్చింది. సరైన సమయానికి వర్షం రాకపోవడంతో దిక్కులు చూస్తున్న రైతులకు ఈ తొలకరి వర్షం ఎంతగానో ఉపయోగపడిందని పలువురు రైతులు అన్నారు. ఉరుములు మెరుపులతో వాన కురవడంతో వర్షపు నీటితో రోడ్లన్నీ నిండాయి. డుంబ్రిగుడ: మండలంలో బుధవారం తొలకరి వర్షం కురిసింది. కొన్ని నెలలుగా వర్షం కురవక పోవడంతో పాటు వేసవికాలం ప్రారంభం నుంచి భానుడి ప్రతాపానీకి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండల తీవ్రతతో గిరిజనులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం తొలకరి వర్షం కురవడంతో వాతావరణం కొంత చల్లబడటంతో మండల వాసులు కొంత ఉపశమనం పొందారు.

➡️