గోతులమయంగా చింతూరు విఆర్ పురం రోడ్డు

ప్రజాశక్తి-విఆర్ పురం : -రేఖపల్లి నుండి చింతూరు వరకు 35 కిలోమీటర్లు తారు రోడ్డు గోతులతో దర్శనమిస్తూ ప్రయాణికుల ఓపికను పరీక్షిస్తున్నాయి.ప్రతి నిత్యం బండ్ల మీద తిరిగే వాహనదారులు ఎక్కడో ఒకచోట గోతుల్లో పడి గాయాల ఫాలు అవ్వడం కూడా నిత్య కృత్యం అయింది.రోడ్డు పక్కన మొత్తం తాడిచేట్లతో నిండిపోయి పక్కకు వాహనాలు తప్పుకునే పరిస్థితి కూడా లేదు.రోడ్డు మొత్తం గోతులు ఏర్పడి ప్రయాణం చేయాలంటేనే నరకంగాఉంది. కనీసం ఆ గోతులు పూడ్చే నాధుడు కూడా లేడు. ఈ రహదారి గుండా నిత్యం దాదాపు 25 గ్రామాల ప్రజలునిత్యం చింతూరు,వి.ఆర్.పురం తిరుగుతూఉంటారు.ఈ ప్రాంత ప్రజలకు చింతూరులోనే పరిపాలనా ప్రధాన కేంద్రాలు ఉండడం వలన నిత్యం రద్దిగానే ఉంటుంది.రాష్ట్రప్రభుత్వం రహదారులు వెయ్యడానికి ఆసక్తి చూపుతున్న ఇక్కడి కూ టమి పెద్దలు మాత్రం మిన్నకుండడం విశేషం. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

➡️