కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

పరిశీలిస్తున కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు :మండలంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ బుధవారం ఆకస్మికంగా సుడిగాలి పర్యటన చేశారు. ఈ పర్యటనలో మొదటిగా సుజన కోట గ్రామ పంచాయతీలో పర్యాటకుల కేంద్రం ఏర్పాటుపై పరిశీలించారు. డుడుమ పర్యాటక ప్రాంతంలో పర్యటించారు.అనంతరం పంచాయతీ పరిధిలో లడ్డ గ్రామంలో ఏకలవ్య ఇంగ్లీష్‌ మీడియం మోడల్‌ హై స్కూల్‌ పాఠశాల భవనాలను పరిశీలించారు. నత్తనడకన కొనసాగుతున్న భవనాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తెలిపారు.బినామీలకు పర్యాటకాన్ని అప్పగిస్తే ఊరుకోం ఆదివాసి గిరిజన సంఘం మండలబినామీలకు పర్యాటక ప్రాంతాన్ని అప్పగిస్తే ఊరుకోమని ఆదివాసి గిరిజన సంఘం మండల కమిటీ సభ్యుడు సొలగం గాసిరం దొర తెలిపారు. మండలంలోని రిజర్వాయర్‌ ముప్పు ప్రాంతంలో నివాసిస్తున్న ఆదివాసి గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలన్నారు. రిజర్వాయర్‌ ముప్పుకు గురై వ్యవసాయ సాగు భూములు నష్టపోయిన కుటుంబాల వారికి పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేయక ముందే ఉపాది అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన మత్స్యకారులకు వలలు, బోట్లు ఉచితంగా సరఫరా చేయాలన్నారు. రిజర్వాయర్‌ ప్రభావానికి గురై భూములు కోల్పోయిన గిరిజన రైతుల కుటుంబానికి 35 కిలోల బియ్యం అందించాలని డిమాండ్‌ చేశారు. ఉచిత విద్యుత్‌ సరఫరా అందిస్తూ, సబ్సిడీ రుణాలు మంజూరు చేసి గిరిజన మత్స్యకారులకు ఆదుకోవాలన్నారు. పర్యాటక ప్రాంతం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ప్రైవేట్‌ వ్యక్తులకు, బినామీలకు ప్రభుత్వం కేటాయిస్తే ఆ ప్రాంత గిరిజనులతో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

➡️