ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండలంలోని గుంటసీమ పంచాయతీ సరియవలస గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజనసంఘం ఆద్యర్యంలో ఆ గ్రామస్తులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి సూర్యనారాయణ మాట్లాడుతూ, గత ఏడాదిలో జల జీవన్ పథకం ద్వారా తవ్విన బోరు నిరుపయోగంగా ఉండడంతో మంచి నీరు అందక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే అధికారులు నిరుపయోగంగా ఉన్న బోరును వినియోగంలోకి తెచ్చి మంచినీరు సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు తిలక్, శ్రీనివసరావు, కె.రాందాస్, సీతారాం, జగత్, తిరుపతి పాల్గొన్నారు.
