అయ్యన్న వ్యాఖ్యలపై ఆందోళనలు

Feb 1,2025 00:11
జి.మాడుగుల మండలం పోతడిగొందిలో నినాదాలు చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-జి.మాడుగుల:గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు పెట్టుబడులు పెట్టేందుకు 1/70 చట్టం ఆటంకంగా ఉందని, గిరిజన చట్టాలను సడలించాలని స్పీకర్‌ అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మండలంలోని గెమ్మెలి పంచాయతీ పోత్తడిగొంది గ్రామంలో. ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యాన గిరిజనులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు సిదేరి సత్తిబాబు మాట్లాడుతూ, 1/70 చట్టంపై చట్టంపై అయ్యన్న వ్యాఖ్యలు సరికాదన్నారు.1/70చట్టం లేకుంటే గిరిజన భూములకు రక్షణ ఉండదని, ఇది కాస్త మారిస్తే ఆదివాసీ ప్రాంతం సర్వనాశనం అయిపోతుందన్నారు. ప్రభుత్వం కావాలని అభివృద్ధి పేరుతో ఆదివాసి ప్రాంతాలను మైనింగ్‌, బాక్సైట్‌ వంటి ఖనిజ సంపద దోచుకపోవడానికి ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. గతంలో టిడిపి బాక్సైట్‌ తీయాలని ట్రైబుల్‌ అడ్వైజరీ కమిటీలో 1/70 చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత ఉవ్వెత్తున ఉద్యమాలు చేయడంతో వెనక్కి తీసుకోవడం జరిగిందన్నారు. అదే స్ఫూర్తితో మళ్లీ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆదివాసి ప్రాంతంలో 1/70 చట్టం ప్రతిష్టంగా అమలు చేయాలని, లేనియెడల ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం నాయకులు గేమ్మిలి కొండబాబు, కొర్ర అర్జున్‌, కొర్ర నారాయణ, గేమ్మిలి ప్రవీణ పాల్గొన్నారు. పెదబయలు:అయ్యన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆదివాసి గిరిజన సంఘం, ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెదబయలు అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు బొండా సన్నిబాబు, ఆదివాసి గిరిజన సంఘం అధ్యక్షులు సాగని ధర్మానపడాల్‌, పెదబయలు జెడ్పిటిసి కూడా బొంజుబాబు, మాట్లాడుతూ, 1/70చట్టంతో గిరిజన భూములకు రక్షణ ఉందన్నారు.ఆదివాసీ ప్రాంతంలో అడవులను బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి ప్రజాసంఘాల నాయకులు పి సా కమిటీ గోమంగి అధ్యక్ష కార్యదర్శులు కూడా రాధాకృష్ణ, జంపరంగి సునీల్‌ కుమార్‌, రోగుల పీసా కమిటీ కార్యదర్శి గుబరి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు సీలేరు:స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చేసిన ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛమైన ప్రకటన చేయాలని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మార్కు రాజు, భాకూరి కోటేశ్వరరావు గొర్ల గణేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జీకే వీధి మండలం దుప్పిలివాడు పంచాయతీలో శుక్రవారం నిరసన కార్యక్రమం చపట్టారు. ఈ సందర్భంగా వారు 1/70 యాక్ట్‌ సవరణ ద్వారానే పెట్టుబడులు వస్తాయని అయ్యన్నపాత్రుడు పేర్కొనడం హస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి గిరిజన హక్కులు, చట్టాలకు తుట్లు పొడిసేలా ప్రకటన చేయడం సమంజసం కాదన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు ఈ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను దోసిపెట్టడానికే ఇటువంటి ప్రకటన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు మనోజ్‌ కుమార్‌ పీసా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శెట్టి రాంబాబు వందల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️