ముగిసిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు

కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:అరకు నియోజక వర్గస్థాయి క్రీడా పోటీల ఎంపికలు బుధవారం ముగిశాయి. రెండు రోజుల పాటు అరకులోయ స్పోర్ట్స్‌ స్కూల్‌ క్రీడా మైదానంలో నియోజకవర్గస్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలు నిర్వహించారు. మొదటి రోజు బాలికల క్రీడా పోటీలు ఆరు మండలాల వివిధ పాఠశాలల నుండి అండర్‌- 14 ,17 విభాగంలో వాలీబాల్‌, కబడ్డి, యోగా, ,షటిల్‌ ఎంపికలు జరిగాయి. ఇందులో భాగంగా అండర్‌ 14 విభాగంలో 306 మంది, 17 విభాగంలో 306 మంది మొత్తం 612 పాల్గొన్నారు. రెండవ రోజు బాలుర విభాగంలో 612 పాల్గొన్నారు. ఇందులో సెలక్షన్‌ అయిన క్రీడాకారులు ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగే క్రీడలో పాల్గొంటారని అల్లూరి సీతారామరాజు జిల్లా స్కూల్‌ గేమ్‌ సెక్రటరీ కొండబాబు తెలిపారు.

➡️