సిపిఎం మహాసభలను జయప్రదం చేయాలి

మాట్లాడుతున్న అప్పలనర్స

ప్రజాశక్తి -హుకుంపేట: అల్లూరి జిల్లా పాడేరులో డిసెంబర్‌ 2 నుండి 5 వరకు నిర్వహించే సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ కార్యదర్శి అప్పలనర్స కోరారు. మండల కేంద్ర లోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, పరిహారం తక్షణమే ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ను కేంద్రం తెస్తుందన్నారు.రాష్ట్రాలు, ఎన్నికైన శాసనసభల హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనంత గిరి జడ్పీటీసీ దీసరి గంగరాజు, హుకుంపేట వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సొంటేన హైమావతి, జన్ని సుబ్బారావు, మండల నాయకులు తమార్బ అప్పల కొండ పడాల్‌, డూరు క్రిష్ణా మూర్తి, కొర్ర అప్పారావు పాల్గొన్నారు.

➡️