ప్రజాశక్తి-పాడేరు : రహదారి భద్రతపై వాహన చోదకులకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ్ సూచించారు. శుక్రవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో భద్రతా మాసోత్సవాలను ఆయన ప్రారంభించారు. రహదారి భద్రతా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 17వ తేదీ నుండి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగు తాయన్నారు. వాహన దారులు తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తే ప్రాణాపాయం తప్పుతుందన్నారు. ప్రమాదాలు జరిగినపుడు సకాలంలో స్పందించాలని సూచించారు. ద్విచక్రవాహన దారులు హెల్మెట్‌లు ధరించాలన్నారు.ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ.కె. పద్మలత, జిల్లా రవాణా అధికారి లీలా ప్రసాద్, రహదారులు భవనాల శాఖ ఇఇ బాల సుందర బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జమాల్ బాషా, రవాణాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్‌ను జయప్రదం చేయాలి ప్రజాశక్తి-పాడేరు : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ దివస్ కార్యక్రమాన్ని న్విహించాలని జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేసారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చి దిద్దాలనే లక్ష్యంతో 12 నెలలకు 12 ధీమ్లుతో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తారన్నారు. మండల ప్రత్యేకాధికారులు స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ. కె.పద్మాపతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అరకులోయ రూరల్: మండల కేంద్రంలోని ఈనెల 18న మూడో శనివారం చేపట్టే స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివాస్ కార్యక్రమం విజయంతం చేయాలని ఎంపీడీఓ లవ రాజు పిలుపునిచ్చారు. మంచి నీటి ట్యాంక్లు శుభ్రం, క్లోరినేషన్, కాలువలు శుభ్రపరచాలన్నారు. కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపిడిఒ కోరారు.
