మన్యంలో పర్యాటకుల సందడి

డుంబ్రిగుడ మండలం చాపరాయి జలపాతం వద్ద పర్యాటకులు

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు రెండు రోజులుగా పర్యాటకుల సందడి నెలకొంది. జిల్లాలోని ఆయా పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులను అధికంగా సందర్శించారు. అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగూడ, హుకుంపేట, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జికే వీధి, సీలేరు, మారేడుమిల్లి దేవి పట్టణం, చింతూరు, మోతుగూడెం ప్రాంతాల్లో సందర్శిత ప్రాంతాలన్నీ పర్యాటకులతో ఆదివారం రద్దీగా మారాయి. ఆంధ్ర ఊటీగా పిలవబడే అరకు లోయలో పరుచుకున్న మంచు తెరల దుప్పటి కొత్త అనుభవాన్ని పంచుతోంది. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ప్రస్తుత వాతావరణంలో పొగ మంచు తాకిడిలో ప్రకృతి సోయగాలకు పర్యాటకులు ఉబ్బి తబ్బి అవుతున్నారు. లంబసింగిలోని ప్రస్తుత వాతావరణం పరిస్థితిలో పర్యాటకులు కొత్త అనుభవాలను రుచి చూస్తున్నారు. జిల్లా పర్యాటక ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ప్రకృతి అందాలకు ప్రసిద్ధి పొందిన బొర్ర గృహాలు, కటికి, తాటిగూడ జలపాతాలు, జలవిహారి, కొత్తపల్లి జలపాతాలతో పాటు పాడేరు మండలంలోని వంజంగి హిల్స్‌లోని మేఘాల కొండపై మంచు అందాలు కూడా పర్యాటకులను ఎంతో ఆకర్షించాయి. అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులంతా ఏజెన్సీకి చేరుకుని ఇక్కడ ప్రకృతి అందాలను వీక్షించారు. పాడేరులోని మోదకొండమ్మ తల్లి, బోడ కొండమ్మ, దారాలమ్మ తల్లి ఆలయాల వద్ద కూడా పర్యాటకుల, భక్తుల రద్దీ నెలకొంది. ఇక్కడ దేవతలను భవాని, అయ్యప్ప మాలధారణ భక్తులతో పాటు ఆయా వర్గాల భక్తులు దర్శించుకున్నారు. హుకుంపేట మండలంలోని పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రమైన మత్స్యగుండంకు కూడా పర్యాటకులు సందర్శించారు.చాపరాయి జలపాతం కిటకిటడుంబ్రిగుడ: పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతంకు ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు తరలిరావడంతో కిటకిటలాడింది. జలపాతంలో సరదాగా చిన్న, పెద్ద తేడా లేకుండా స్నానాలు చేస్తూ ఆనందంగా గడిపారు. చాపరాయి లోని ఉద్యానవనంలో పర్యాటకులు ఫోటోలు తీయించుకుంటూ సందడి చేశారు. పర్యాటక ప్రదేశంలో పర్యాటకులు పోటెత్తాడంతో సందడి వాతావరణం నెలకొంది.

➡️