పాఠశాలలను సందర్శించిన డిప్యూటీ డైరెక్టర్‌

విద్యార్థులతో మాట్లాడుతున్న గిరిజన సంక్షేమశాఖ డీడీ విజయశాంతి

ప్రజాశక్తి-దేవీపట్నం

దేవీపట్నం మండలంలోని తాటివాడ, డిఎన్‌.పాలెం, పాముగండి, పెద్దూరు తదితర గ్రామాల్లోని జిపిఎస్‌, ఆశ్రమ పాఠశాలలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ విజయశాంతి మంగళవారం సందర్శించారు. రికార్డులు, విద్యార్థుల హాజరు పట్టికలను తనిఖీ చేశారు. పాఠశాలల ఆవరణలు, స్టోర్‌ రూములు, వంటశాలలను పరిశీలించారు. పాఠశాలలలో మౌలిక వసతులు, సదుపాయాలు గురించి ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, తాగునీరు, ఆహారం విషయంలో సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్యా వైద్యం అందించాలని ఆదేశించారు.

➡️