ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని గోందిగూడలో యుటిఎఫ్ సహకారంతో భీమిలి పట్నం కలిగొట్ల స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ సౌజన్యంతో నిరుపేద గిరిజనులకు, వృద్ధులకు చీరలు, రగ్గులు, టవల్స్‌తో పాటు స్టీల్ బేసిన్స్, గ్లాసులు, స్టీల్ బాక్స్ లు ఉచితంగా పంపిణి చేశారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ ఫౌండేషన్ చైర్మన్ కే శ్రీరామచంద్ర మూర్తి మాట్లాడుతూ, కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థంగా ప్రతి ఏడాది ఈ రకంగా వివిధ మండలాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి మాదకద్రవ్యాలు వంటి వాటికి దూరంగా ఉండి, చక్కటి జీవన విధానాన్ని అలవర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పలు రకాల వాటిని పంపిణీ చేయడంపై గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ సభ్యులు పైడిరాజు, వి రాంబాబు, స్థానిక మండల అధ్యక్షుడు ఎస్ బాలకృష్ణ , అల్లూరి జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు మహేశ్వరరావు, సహాధ్యక్షులు చిట్టిబాబు, కార్యదర్శిలు కన్నయ్య, బాబురావు పాల్గొన్నారు.
