గిరిజనులకు రగ్గులు పంపిణీ

రగ్గులు పంపిణీ చేస్తున్న అమ్మ ట్రస్టు సభ్యులు

ప్రజాశక్తి -అనంతగిరి: మండలంలోని అనంతగిరి పంచాయతీ పరిది తాడిగుడ గ్రామంలో గిరిజనులకు ఆదివారం అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన రగ్గులు పంపిణీ చేశారు. ట్రస్ట్‌ సభ్యులు కలిసి సుమారుగా 35 కుటుంబాలకు ఉన్నితో కూడిన రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ చైర్మన్‌ వెంకటరావు మాట్లాడుతూ, చలికాలంలో ప్రతీ ఒక్కరు ఈ రగ్గులును ఉపయోగించి చలి నుంచి రక్షణ పొంధాలని కోరారు. ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలకు విద్య, ఆరోగ్యం అవసరాల నిమిత్తం అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ సెక్రటరీ సింగంపల్లి. అచ్చిబాబు, ఎల్‌. సత్యనారాయణ, దొగ్గ ఎరుకు నాయుడు, సచివాలయం సిబ్బంది గోపి, గిరిజనులు పాల్గొన్నారు.

➡️