ప్రజాశక్తి-ముంచింగిపుట్టు : సమస్యలను పరిష్కరించాలని మండలంలోని వనుగుమ్మ పంచాయతీ వనగుమ్మ గ్రామం లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల శుక్రవారం పని ప్రదేశంలోని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం లో భాగంగా 250 రోజులు కల్పించి, రోజువారి కూలి 600 రూపాయలు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి పని ప్రదేశం లో మెడికల్ కిట్, టెంటు, పని ప్రదేశంలో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పనిముట్లు ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. 15 రోజుల్లో వేతనాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ప్రమాద బీమా సౌకర్యంతో పాటు మెడికల్ కిట్లు, టెంటు, పనిముట్లు ఇచ్చేవారని ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి సౌకర్యం అందించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ చండల్, ఎస్ సంతన్న, ఎన్ డుంబురు, ఎస్.సుఖ్ దేవ్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.