కచ్చితమైన ఫలితాలు ప్రకటించాలి

పొటొ: మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు: భారత ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పాటిస్తూ, ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టాలని, త్వరిత గతిన కచ్చితమైన ఫలితాల ప్రకటనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీనియర్‌ డిప్యూటి ఎలెక్షన్‌ కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. బుదవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించిన వ్యాస్‌ మాట్లాడుతూ, జిల్లాలో కౌంటింగ్‌ కు చేపట్టిన ఏర్పాట్లను, శాంతి భద్రతలకు తీసుకున్న చర్యలపై ఆరా తీసారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం. విజయ సునీత మాట్లాడుతూ, జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, వాటి ఓట్ల లెక్కింపునకు పాడేరు, రంపచోడవరంలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అరకు పార్లమెంట్‌ సిగ్మెంట్లకు, నియోజక వర్గాలకు సంబంధించి వేర్వేరు కౌంటింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేసామన్నారు. మీడియా సెంటర్‌, అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు. కౌంటింగ్‌ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లను నియమించామని, నిరంతర విధ్యుత్‌ సరఫరాకు, సిసి కెమెరాల పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నామని వివరించారు. అదనపు ఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్‌ మాట్లాడుతూ, పటిష్ట బందోబస్తుకు చర్యలు తీసుకున్నామని, గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ పోలీస్‌, కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులను కేటాయించామని తెలిపారు. 22 చెక్‌ పోస్టులు, 43 పికెట్స్‌ ఏర్పాటు చేసామని, ట్రాఫిక్‌ క్రమభాద్దీకరణ చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో జిల్లా రెవెన్యు అధికారి బి.పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

➡️