ఉత్సాహంగా స్కిప్పింగ్‌ పోటీలు

May 29,2024 23:43
ఆడుతున్న విద్యార్థులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా బుధవారం స్థానిక గ్రంథాలయంలో విద్యార్థులకు స్కిప్పింగ్‌ పోటీలను నిర్వహించారు. సుమారు 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు నేపథ్యంలో ప్రభుత్వం విజ్ఞాన శిబిరాలను నిర్వహిస్తుందని, వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని గ్రంధాలయ అధికారిని సునీత కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సుబ్బారావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️