ప్రజాశక్తి -ముంచింగిపుట్టు: మండలంలోని పలు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసుబాబు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరిముఖిపుట్టు పంచాయితీలోనీ ధూళిపుట్టు గ్రామంలో కించాయి పుట్టు పంచాయతీ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరి, రాగులు, సామలు నూతన వంగడాల సాగు, ఆవశ్యకతను వివరించారు. భూసార పరిరక్షణ విదానాలు వివరించారు. పెరటి తోటల పెంపకంతో కలిగే ప్రయోజనాలు వివరించారు. పశు భీమా, ప్రకృతి వ్యవసాయం, జీవామృతం, బీజామృతం తయారీ ప్రక్రియను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు బాబి కిరణ్, తరుణ్, గ్రామ పశు వైద్య సహాయకులు రాజు, ప్రకృతి వ్యవసాయ సహాయకులు గురు, గాసిరాం పాల్గొన్నారు.