రచ్చబండ నిర్మాణానికి శంకుస్థాపన

శంకుస్థాపన చేపడుతున్న సిపిఎం సర్పంచ్‌ సునీత

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:గ్రామ పంచాయతీ నిధులతో కంగారు సోలా గ్రామంలో రచ్చబండ నిర్మాణం చేపడుతున్నట్లు గసభ పంచాయితీ సిపిఎం సర్పంచ్‌ పి సునీత చెప్పారు. రచ్చబండ పనులను ఆదివారం ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ, గ్రామ అబివృద్ధి, గ్రామంలో సమస్యలు చర్చించుటకు రచ్చబండ వేధిక కానుందని చెప్పారు. వీధి దీపాలు, పారిశుద్ధ్యం, అంగన్వాడీ భవనాల మరమ్మత్తు పనులు, తాగునీరు కోసం ఈసారి వచ్చిన నిధులతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సుమారు రూ 10 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టుటకు శ్రీకారం చుట్టామని చెప్పారు. త్వరలోనే సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాంగి దొరబాబు, పాంగి రామారావు, గ్రామ పెద్దలు సోమేశ్‌, సుబ్బారావు, సీతన్న ,డొంబు, సిబో తదితరులు పాల్గొన్నారు.

➡️