రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

మాట్లాడుతున్న జెడ్‌పిటిసి గంగరాజు

ప్రజాశక్తి- అనంతగిరి:మండలంలోని ఎగువశోభ పంచాయతీ జామగుడ బీటి రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం తక్షణమే నిదులు మంజూరు చేయాలని స్దానిక జెడ్పీటీసీ దీసరి. గంగరాజు డిమాండ్‌ చేశారు. సీపీఎం శాఖ మహా సభ ఎగువశోభలో జరిగింది. అనంతరం గ్రామస్తులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, అరకు మెయిన్‌ రోడ్డు కాఫి తోటల నుండి జామగుడ, కమలపురం, పూలగుడ గ్రామం సుమారు ఐదు కిలోమీటర్ల బీటి రోడ్డు నిర్మాణనికి పల్లె పండుగలో భాగంగా కూటమి ప్రభుత్వం తక్షణమే నిదులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. జామగుడ గ్రామంలో సీసిరోడ్డు, డ్రైనేజీలు, చెక్‌ డ్యామ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై అల్లరి జిల్లా కలెక్టర్‌, ఐటిడిఎ పిఓ దృష్టికి తీసుకెళతామన్నారు. అనంతరం శాఖ కార్యదర్శిగా మ్మెల సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు. సాగర రాజు, గోవింద్‌, మదు, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️