xప్రజాశక్తి -పాడేరు : గిరిజన గురుకులం లో ఉన్న ఖాళీ పోస్టులను మెగా డిఎస్సీ నుండి మినహాయింపు ఇవ్వాలని సి.పి.ఎం జిల్లా కార్యదర్శి పి అప్పల నర్స డిమాండ్ చేశారు. పాడేరు ఐ.టి.డి. ఏ వద్ద గిరిజన గురుకులం అధ్యాపకులు నిర్వహిస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని గురువారం సందర్శించి మద్దతు ప్రకటించారు.13 రోజులుగా ఔట్సోర్సింగ్ టీచర్లు నిర్వహిస్తున్న రిలే దీక్షలు గురువారం కొనసాగాయి.. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత రెండు వారాల నుంచి రిలే దీక్షలు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ టీచర్ల ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. గత 15 ఏళ్లుగా విద్యా రంగంలో అన్ని శాంక్షన్ పోస్టుల్లో సీఆర్టీలు, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు పని చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వీరిని శ్రమ దోపిడీకి గురి చేస్తోందని ధ్వజమెత్తారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నా స్పందించ లేదన్నారు. గిరిజన గురుకులం ఖాళీ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ లో విలీనం చేయడం తగదన్నారు. ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ ద్వారానే పోస్ట్లు భర్తీ చేయాలని ఆయన కోరారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు పరచలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఆమె విమర్శించారు. ఉద్యోగాలు సాగించే వరకు పోరాటం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బోజన్న, చిన్నారావు, దాస్, గురుకుల ఔట్సోర్సింగ్ టీచర్లు పాల్గొన్నారు.