ఆశ్రమ పాఠశాలలో హెల్త్‌ అసిస్టెంట్లను నియమించాలి-

మాట్లాడుతున్న గంగరాజు

ప్రజాశక్తి అనంతగిరి:ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వైద్యం అందించే హెల్త్‌ అసిస్టెంట్‌ లేక విద్యార్థినీ విద్యార్థులు మృత్యువాతకు గురవుతున్నారని స్థానిక సిపిఎం జెడ్పిటిసి గంగరాజు అన్నారు. మండలంలోని టోకురు బాలికల పాఠశాలలో అనారోగ్యంతో ఏడవ తరగతి చదువుతున్న అప్పలకొండ విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై జడ్పిటిసి ఫిర్యాదు మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి జమల్‌ భాష శనివారం పాఠశాలలో సందర్శించి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థినిలకు ఆరోగ్య సమస్యల పట్ల వైద్య పరీక్షలు నిర్వహించడం కాకుండా ఆరోగ్య సూత్రాలను వివరించారు. గంగరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, హెల్త్‌ అసిస్టెంట్లను నియమించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్పందించి విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు ఈ కార్యక్రమంలో టోకురు సర్పంచ్‌ కిల్లో మొస్య, పాఠశాల హెచ్‌ఎం స్వరూప రాణి పాల్గొన్నారు.

➡️