ప్రజాశక్తి-చింతపల్లి: మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వారపు సంత రోజు కావడంతో హఠాత్తుగా పడిన వర్షం కారణంగా సంతకు వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ వర్షంతో వ్యవసాయ భూములకు తాత్కాలిక ఉపశమనం లభించనుంది. రోడ్లు జలమయం కావడంతో ప్రజలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు ఇంటి లోపల ఉండటం చాలా సురక్షితమని, విద్యుత్ స్తంభాలు, పాడుబడిన భవనాలు, చెట్లు, కొండలు లేదా ఇతర ఎత్తైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని వైద్య సిబ్బంది సూచించారు.
