ప్రజాశక్తి-డుంబ్రిగుడ:పర్యాటక కేంద్రం చాపరాయి జల విహారిలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎస్జె రవినాథ్ తిల్హరి కుటుంబ సభ్యులతో మంగళవారం సందర్శించారు. జల విహారిలో సందర్శించిన ఆయనకు గిరిజన సంప్రదాయ నృత్యంతో గిరి మహిళలు స్వాతగం పలికారు. జల విహారిలో సరదాగా స్నానాలు ఆచరిస్తున్న పర్యాటకులు, పచ్చని అందాలను చూసిన ఆయన మంత్రముగ్ధులయ్యారు.