వెలుగు కార్యాలయ స్థలం పరిశీలన

Apr 4,2024 00:20
స్థలాన్ని పరిశీలిస్తున్న రెవిన్యూ అధికారులు

ప్రజాశక్తి హుకుంపేట: వెలుగులో కార్యాలయం సిబ్బంది పిర్యాదు మేరకు బుధవారం డీప్యూటీ తహశీల్దార్‌, మండల సర్వేయర్లు వెలుగు కార్యాలయం స్థలాన్ని సర్వే నిర్వహించి పరిశీలించారు. బుడ్డిగ కొండమ్మ అక్రమించిన స్థలాన్ని దగ్గర ఉండి పరిశీలించి వెలుగు కార్యాలయం సిబ్బందికి అప్పజెప్పారు. అనంతరం డీప్యూటీ తహశీల్దార్‌ సీహెచ్‌ కృష్ణారావు మాటా ్లడుతూ, ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు వెలుగు కార్యాలయం సిబ్బందికి సదరు స్థలాన్ని అప్పగిం చామన్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్‌ శ్రీనివాస్‌, వీఆర్వో కొండబాబు, ఏపిఏం కృష్ణారావు పాల్గొన్నారు.

➡️