పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జెసి మెగా జాబ్‌ మేళాను వినియోగించుకోవాలిప్రజాశక్తి-పాడేరు: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో ఈ నెల 15వ తేదీన మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు సంయుక్త కలెక్టర్‌ ఎం.జె. అభిషేక్‌ గౌడ తెలిపారు. బుధవారం జెసి చాంబర్‌ లో జరిగిన ఒక ప్రత్యెక కార్యక్రమంలో సంకల్ప్‌ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మెగా జాబ్‌ మేళా పోస్టర్‌ను జేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, అత్యంత ప్రతిష్ట గల సుమారు 28 సంస్థలు ఈ మెగా జాబ్‌ మేళాలో పాల్గొని వారికి అవసరమైన నిరుద్యోగ అభ్యర్ధులను ఎంపిక చేసి వెంటనే వారికి నియామక ఉత్తర్వులు అందజేస్తారని తెలిపారు. 18ఏళ్ళు నిండిన పదవ తరగతి ఆ పైన ఉన్నత చదువులు చదివిన వారు జాబ్‌ మేళాకు హాజరై ఉపాధి పొందాలని జేసి సూచించారు. ఎంపికైన అభ్యర్ధులకు విద్య, నైపుణ్యాల ఆధారంగా రూ. 12 వేల నుండి రూ. 35 వేల వరకు వేతనం లభిస్తుందని జెసి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అదికారి రోహిణి, సహాయకులు నవీన్‌ పాల్గొన్నారు.

Mar 13,2025 00:04
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జెసి

xజాశక్తి-పాడేరు: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో ఈ నెల 15వ తేదీన మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు సంయుక్త కలెక్టర్‌ ఎం.జె. అభిషేక్‌ గౌడ తెలిపారు. బుధవారం జెసి చాంబర్‌ లో జరిగిన ఒక ప్రత్యెక కార్యక్రమంలో సంకల్ప్‌ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మెగా జాబ్‌ మేళా పోస్టర్‌ను జేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, అత్యంత ప్రతిష్ట గల సుమారు 28 సంస్థలు ఈ మెగా జాబ్‌ మేళాలో పాల్గొని వారికి అవసరమైన నిరుద్యోగ అభ్యర్ధులను ఎంపిక చేసి వెంటనే వారికి నియామక ఉత్తర్వులు అందజేస్తారని తెలిపారు. 18ఏళ్ళు నిండిన పదవ తరగతి ఆ పైన ఉన్నత చదువులు చదివిన వారు జాబ్‌ మేళాకు హాజరై ఉపాధి పొందాలని జేసి సూచించారు. ఎంపికైన అభ్యర్ధులకు విద్య, నైపుణ్యాల ఆధారంగా రూ. 12 వేల నుండి రూ. 35 వేల వరకు వేతనం లభిస్తుందని జెసి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అదికారి రోహిణి, సహాయకులు నవీన్‌ పాల్గొన్నారు.

➡️