జోరుగా అక్రమ నిర్మాణాలు-

Apr 19,2024 00:27
అక్రమంగా చేపడుతున్న కట్టడం

 

పట్టించుకోని రెవెన్యూ అధికారులుప్రజాశక్తి-హుకుంపేట:సందడిలో సడే మియా అన్నట్టు ఎన్నికల వేళ ఎవరు పట్టించు కోరని భావించిన గిరిజనులు మండల కేంద్రంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. మండల కేంద్రంలో జోరుగా పలు అక్రమ కట్టడాలు కడుతున్నారు. మండల కేంద్రంలో ఓ గిరిజనేతరుడు కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకుని, రెండంతస్తుల శ్లాబును శ్రీరామనవని బుధవారం సెలవు కావడంతో నిర్మించుకున్నాడు. గిరిజనులు చిన్న దుకాణం వేస్తే ఆగమేగాలపై తొలగించే రెవిన్యూ అధికారులు మండల కేంద్రంలో అక్రమ కట్టడాలు కనబడలేదా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారుల ఆదేశాల నిర్మాణాలు జరుగుతున్నాయని పలువురు ప్రజా సంఘాలు నేతలు ఆరోపించారు. మండల కేంద్రంలో జోరందుకున్న అక్రమ కట్టడాల నిలుపుదలకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించ లేదని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కట్టడాలు నిలుపుదల చేసి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు.

➡️