గిరిజనులకు వైద్య సేవలు

పరీక్షిస్తున్న వైద్యులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: స్థానిక డుంబ్రిగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ఖండ్రూమ్‌ పంచాయతీ కేంద్రంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వ్యాదిగ్రస్తులకు వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి వైద్య సేవలను అందించారు. ఈ శిబిరానికి స్థానిక పంచాయతీ సర్పంచ్‌, సర్పంచ్‌ ల ఫోరం మండల అధ్యక్షుడు కే.హరి పాల్గొని మాట్లాడుతూ, గ్రామాల్లో వైద్య సిబ్బంది వైద్య శిబిరాలు నిర్వహించి గిరిజనులకు వైద్య సేవలు అందించడం చాలా మంచిదన్నారు. మారుమూల గ్రామాల గిరిజనులు అనేకమంది వైద్య సేవలు చేయించుకోవడానికి హాస్పటల్‌కు వెళ్ల లేక పోతున్నారని, ఇటువంటి వైద్య శిబిరాలతో గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈఓ శౌరి పాల్గొన్నారు.

➡️