ప్రజాశక్తి-పాడేరు: నేటి యువత, విద్యార్థిని, విద్యార్థులు కవయిత్రి మొల్ల మాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తి పొందాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కవియిత్రి మొల్ల జయంతిని ఘనంగా నిర్వహించారు. కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. మొల్ల ఆనాటి పరిస్థితులను ఎదుర్కొని సాహసోపేతంగా రామాయణం రచించారని, అదే మొల్ల రామాయణం గా ప్రసిద్ధి చెందిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె. పద్మలత, సిపిఓ ఎస్‌ఎస్‌ఆర్ కే పట్నాయక్, ఉద్యాన శాఖ అధికారి రమేష్ కుమార్ రావ్, పర్యాటక అధికారి జి.దాస్, డిపిఆర్‌ఓ గోవిందరాజులు పాల్గొన్నారు.
