మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిప్రజాశక్తి-చింతపల్లి: ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నాయకులు రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వం పని చేస్తుందని మాయమాటలు చెప్పి అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా పట్టించుకోలేదని పాడేరు వైకాపా మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి విమర్శించారు. చింతపల్లి, జీకే వీధి ఎంపీపీలు కోరాబు అనూష దేవి, బోయిన కుమారిలతో కలిసి ఎంపీపీ నివాస గృహంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైకాపా నాయకులు ప్రశ్నిస్తుంటే ఎదురుదాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె మండిపడ్డారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తో పాటు సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలని లేకపోతే ప్రభుత్వంపై మరో ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు.
