ప్రజాశక్తి -అరకులోయ రూరల్: మండలంలోని బస్కీ గ్రామాన్ని బుధవారం ఎంపీడీవో ఎల్ లవరాజు, వైద్య సిబ్బంది పర్యటించారు. బుధవారం గ్రామంలో 20 మంది చిన్నారులు విష జ్వరాలతో అరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివిధ పత్రికల్లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. అధికారులు, వైద్యులు గ్రామంలోకి వెళ్లి ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు.ఎంపీడీఓ లవరాజు మాట్లాడుతూ గ్రామంలో విషజ్వరాలు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి మంచి నీరు అందించాలని సచివాలయం సిబ్బందికి సూచించారు. రెండు రోజులు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేష్ కుమార్, సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.