ప్రజాశక్తి -అనంతగిరి:నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం పట్ల పాఠశాల యాజమాన్యం శ్రద్ధ చూపాలని,. రుచికరమైన భోజనం పెట్టాలని స్థానిక జెడ్పిటిసి దీసరి. గంగరాజు సూచించారు. స్థానిక బాలికల పాఠశాల1లో సమస్యలు అడిగి తెలుసుకునేందుకు మంగళవారం గంగరాజు తో పాటు ఏటిడబ్ల్యూఓ .వెంకటరమణ, ఎంఈఓ .బాలాజీ సందర్శించారు. అనంతరం హెచ్‌ఎం విమల కుమారి, డిప్యూటీ వార్డెన్ స్వరూప రాణితో మాట్లాడారు. తరగతి గదుల్లో సందర్శించి భోజనం సదుపాయంపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో హెల్త్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించక పోవడంతో విద్యార్థులకు ఆరోగ్యం సమస్య ఏర్పడినప్పుడు సకాలంలో వైద్య సేవలు అందక వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. తక్షణమే హెల్త్ అసిస్టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు.విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ నాగులు, ఉప సర్పంచ్ పి. అర్జున్, తదితరులు పాల్గొన్నారు.
