సిపిఎం బృందం ఆధ్వరంలో ముమ్మరంగా ప్రచారం
ప్రజాశక్తి-విఆర్ పురం :. ఈనెల 27వ తేదీన జరుగుతున్న శాసనమండలి ఎన్నికలలో పిడిఎఫ్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న దిండ్ల వీర రాఘవులుని గెలిపించాలని కోరుతూ మండలంలోని రేఖపల్లి కేంద్రంలో సిపిఎం బృందం ఆధ్వర్యంలో ఆదివారం ముమ్మరంగా ప్రచారం చేయడం జరిగింది. జిల్లా కమిటీ సభ్యులు సోయం చిన్నబాబు జిల్లా సభ్యులు మండల కార్యదర్శి పులి సంతోష్ కుమార్. మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనేది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులతో పాటు సంఘటిత, అసంఘటిత రంగాలలోని లక్షలాది మంది గొంతుక.ఎమ్మెల్సీ వైపు నిలబడాలి.ఎమ్మెల్సీ కి మీరు వేసే ఓటు ఉపాధ్యాయులతో పాటు ప్రజా గొంతుకకు బలమవ్వాలి. సమాజ సమిష్టి ప్రయోజనాలతో మనకి పనిలేదంటే, సమాజానికి మనతోనూ, మన బడితోనూ పనిలేకుండా పోతుంది. ఎమ్మెల్సీ ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకు మనం మద్దతుగా నిలిస్తే, ఆ వర్గాలన్నీ మనకి, మన బడికి మద్దతుగా నిలుస్తాయ్. నీ ఓటు పాలక పార్టీల బలన్నీ, ఆ పార్టీల మద్దతుదారుల బలాన్ని పెంచడం అంటే ఇప్పుడు జరుగుతున్న విద్యాసంస్కరణలను సపోర్ట్ చేసి బడి బలహీనపరుచుకోవడమే! గత, ప్రస్తుత ప్రభుత్వాలు చర్యలు నీ బడిని ఎటు తీసుకుపోతున్నాయో స్పష్టంగా కనిపిస్తూనే ఉందిగా.విజ్ఞతతో ఆలోచించండి. ఎమ్మెల్సీ ని గెలిపించండి. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పులి సంతోష్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు సోయం చిన్నబాబు, మండల కమిటీ సభ్యులు పోడియం శ్రీరామ్మూర్తి, పంకు సత్తిబాబు,గుండెపూడి లక్ష్మణరావు,కమ్మచిచ్చు సత్యనారాయణ, కారం సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.