పిడిఎఫ్‌ అభ్యర్థి విజయగౌరిని గెలిపించాలి

Feb 15,2025 00:13
మాట్లాడుతున్న సురేంద్ర

ప్రజాశక్తి అనంతగిరి:ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్‌ అభ్యర్థి గోరెడ్ల విజయ గౌరికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మండలంలోని ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాలలో స్థానిక సిపిఎం జెడ్పిటిసి దీసరి .గంగరాజు, మండల యుటిఎఫ్‌ ప్రతినిధులు ప్రచారం చేపట్టారు. కొత్తవలస బాలుర, బాలికల పాఠశాలలో సందర్శించి ప్రచారం నిర్వహించారు ఉపాధ్యాయ సిబ్బంది సమస్యలపై నిరంతరం పోరాటం చేసే పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపిచాలని కోరారు. చట్టసభల్లో సమస్యల పట్ల గొంతు వినిపించే నాయకులకు మొదటి ఓటు ప్రధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సర్పంచ్‌ కిలో. మోసియా, నాయకులు నాగులు పాల్గొన్నారు.అనంతగిరి రూరల్‌:మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని జడ్పిటిసి గంగరాజు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టసభలలో ఉపాధ్యాయుల, పాఠశాలల బలోపేతానికి కృషి చేసే పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో టోకూరు సర్పంచ్‌ కిల్లో మోస్యా, గిరిజన సంఘ నాయకులు సోమెల నాగులు, అనంతగిరి మండల యుటిఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు. అరకులోయ రూరల్‌: పిడిఎఫ్‌ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజరుగౌరిని గెలిపించాలని అరకులోయ మండలంలోని ఏపీ గురుకులం పాఠశాలలో,కళాశాల, కస్తూరిబా గాంధీ పాఠశాలలో శుక్రవారం ప్రజా సంఘాలు ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, యుటిఎఫ్‌ బలపరిచిన పిడిఎఫ్‌ అభ్యర్థి విజయ గౌరీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను అభ్యర్థించారు. గురుకుల పాఠశాల, కళాశాలలో పని చేస్తున్న కాంటాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై అనేక పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలిపారని గుర్తు చేశారు. విజరు గౌరిని ఎమ్మెల్సీగా గెలిపించి చట్టసభలో పంపిస్తే సమస్యలపై శాసనమండలిలో లేవనెత్తి పరిష్కరించే విధంగా కృషి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఆదివాసి సంఘం మండల నాయకులు కె రామారావు పాల్గొన్నారు.

➡️