పేదలకు స్థలాలు, గృహాలు ఇవ్వాలి

Mar 10,2025 00:11
మాట్లాడుతున్న అప్పలనర్స

ప్రజాశక్తి -పాడేరు : పేదలకు ఇల్లు, నిర్మాణానికి స్థలం కేటాయించాలని సి.పి.ఎం జిల్లా కార్యదర్శి పి అప్పల నర్స డిమాండ్‌ చేశారు. పార్టీ ప్రజా చైతన్య యాత్ర లో భాగంగా చింతల వీధి పంచాయితిలో సమస్యలపై స్థానిక ప్రజలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పి అప్పల నరస మాట్లాడుతూ, ఈనెల 8వ తేదీ నుండి 28 తేదీ వరకు గ్రామ పర్యటన నిర్వహించి ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి అర్జీలు సమర్పించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సభలు నిర్వహిస్తున్నామన్నారు. ఇల్లు, స్థలం లేని పేదలకు ప్రభుత్వం తక్షణమే స్థలం కేటాయించాలని ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేయాలని కోరారు. పీఎం జన్మన్‌ స్కీం కింద ఇవి మంజూరు చేస్తున్న ఇళ్లకు యూనిట్‌ కాస్టు ఐదు లక్షల రూపాయలకు పెంచాలని ఇల్లు లేని ప్రతి పేదలకు ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాగునీరు, పెన్షన్లు తదితర సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. 200ఎకరాలకు సాగునీరు అందించేందుకు చెక్‌ డ్యాం నిర్మాణం చెపట్టాలని, చెరువు లో మట్టి పూడిక తీయాలని కోరారు. పి.ఎం కిసాన్‌ కొంత మంది కి ప్రభుత్వం రాయితీ అందడం లేదని, ఉపాధి పనులు ప్రారంభం తక్షణం చేయాలని , గతం లో రెండు వారం రోజులుగా పనులు చేసిన వారికి డబ్బులు చెల్లించలేదన్నారు . ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ఎల్‌. సుందరరావు, దాస్‌, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు సతీష్‌ పాల్గొన్నారు.

➡️