ప్లాస్టిక్‌పై అవగాహన ర్యాలీ

అవగాహన ర్యాలీ

ప్రజాశక్తి – చింతపల్లి : ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని స్థానిక సర్పంచ్‌ దురియా పుష్పలత, ఎంపీడీవో శ్రీనివాసరావు కోరారు. ప్లాస్టిక్‌ ను నిషేధిద్దాం… పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో బుధవారం చింతపల్లి వారపు సంతలో సర్పంచ్‌, ఎంపీడీవోల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కలెక్టర్‌ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 1 నుండి ప్లాస్టిక్‌ ను పూర్తిగా నిషేధిస్తున్నామన్నారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని వ్యాపారులు, వినియోగదారులు పూర్తిగా నిషేధించాలని, లేని పక్షంలో రూ.500 నుంచి 1000 వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అంబేద్కర్‌, ఏఎన్‌ఎంలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️