పోడు భూములకు పట్టాలివ్వాలి

 సిపిఎం జిల్లా సభ్యులు సోయం చిన్నబాబు డిమాండ్

ప్రజాశక్తి-విఆర్ పురం : ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. ములకనపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో సోయం చిన్నబాబు పత్రికా ప్రకటన చేశారు. వారుమాట్లాడుతూ ములకనపల్లి, కుందులూరు, గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఆదివాసిలు గత 40 సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి ఆటవి హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ఐటిడిఏ చింతూరు వారికి వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా గిరిజనులకు న్యాయం చేస్తుందని ఏద్దవా చేశారు. రెవెన్యూ గ్రామ సభలు పెట్టి నెలలు గడుస్తున్న వారికి ఇప్పటివరకు పరిష్కారం సుపలేదని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులను స్పందించాలని వలస ఆవాసులకు పోడి భూములు పట్టాలు ఇవ్వాలని అధికారులను కోరారు.

➡️