వాలీబాల్ విజేతలకు బహుమతులు

prizes to wally ball team
  • అందజేస్తున్న ఎస్ ఐ మనోజ్ కుమార్
  • రూఢకోటలో సిఆర్పిఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ 

ప్రజాశక్తి-పెదబయలు : గిరిజన యువకుల క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సిఆర్పిఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో వివిధ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని సిఆర్పిఎఫ్ డిప్యూటీ కమాండెంట్ భగత్ సింగ్ అన్నారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలం రుడకోటలో స్థానిక అవుట్ పోస్ట్ సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో చుట్టుపక్కల గ్రామాల 6 జట్లు పాల్గొనగా ఇందులో కుమడ జట్టు మొదటి బహుమతిని, కాండ్రంగివలస జట్టు రెండో బహుమతిని గెలుచుకుంది. మొదటి రెండవ బహుమతి గెలుచుకున్న జట్లకు బహుమతితో పాటు వాలీబాల్ కిట్లను సిఆర్పిఎఫ్ డిప్యూటీ కమాండెంట్ భగత్ సింగ్, డి.ఎస్.పి త్రిలోచన్ బేరా, ఇన్స్పెక్టర్ ఏకే మిశ్రా చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న అన్ని జట్లకు వాలీబాల్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ సిబ్బంది మాట్లాడుతూ.. సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం లో భాగంగా గిరిజన గ్రామాలలో గిరిజన యువకుల క్రీడా నైపుణ్యాన్ని వెలికితీస్తూ వారిని క్రీడల పట్ల మక్కువ పెరిగేందుకు ఎంతగానో కృషి చేస్తున్నామని వారు అన్నారు. ఇటువంటి అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పెదబయలు ఎస్సై మనోజ్ కుమార్, రుడకోట పిహెచ్సి వైద్యులు కిషోర్, సత్యారావు, మాజీ సర్పంచ్ పండ సుబ్రహ్మణ్యం, సత్యం, గణేష్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️