మోకాళ్లపై నిరసన

Feb 1,2025 00:14
నినాదాలు చేస్తున్న నేతలు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మాణంకు భూములు ఇచ్చిన భూదాతలకు ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలని కోరుతూ ఆ పాఠశాల ఆవరణ ఎదుట చేపట్టిన ఆందోళన శుక్రవారం 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆందోళన శిబిరంలో పాల్గొని మోకాళ్ళతో నిలబడి నిరసన తెలియజేస్తూ తమ సంఘీభావాన్ని తెలియజేశారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధి చిన్నస్వామి మాట్లాడుతూ, భూములు ఇచ్చిన దాతలకు ఉద్యోగాలు కల్పించకుండా వేరే వారికి వారి స్థానంలో నియమించడం సరికాదన్నారు. తొమ్మిది రోజు నుంచి దీక్షలు చేపట్టి ఆందోళన చేస్తున్నా అధికారులు న్యాయం చేయకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పరశురాం, జగన్నాథం, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.

➡️