ఉపాధ్యాయుడ్ని నియమించాలని నిరసన

ఉపాధ్యాయుడ్ని నియమించాలని నిరసన

నిరసన చేపడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

ప్రజాశక్తి -అనంతగిరి:మండలంలోని పిన్నకోట, గుమ్మ పంచాయతీ మారుమూల గ్రామాలైన కొట్టేంగుడ, గొప్పిలపాలెం, కడరేవు, కళ్యాణగుమ్మి గ్రామాలకు ఉపాధ్యాయులను నియమించాలని వినూత్న రీతిలో గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాజారావు, విజయకుమార్‌, ఆర్‌.రాజారావులు మాట్లాడుతూ, తమ రెండు పంచాయతీ పరిది గ్రామాలకు 15 సవత్సరల నుండి ప్రభుత్వం ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయలేదన్నారు. 5 నుండి 10 సంవత్సరాలు నిండిన 38 మంది ఉన్నారనీ విద్యా బోధనలు లేక నిరక్షరాసులుగా మిగిలి పోయారన్నారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతపుడి పాఠశాలకు వెళ్లాలంటే సుమారు మూడు కిల్లో మీటర్లు దూరం ఉందన్నారు. అనంతగిరి గుమ్మ పంచాయతీ కర్రిగొడ పాఠశాలకు కొండకోనల నడమ మూడు కిల్లో మీటర్లు దూరం ప్రయాణం చేయాల్సి ఉందన్నారు. వర్షా కాలంలో గెడ్డలు దాటి వెల్లలేని పరిస్థితిలో చదువుకు దూరం మవుతున్నారని, ఇప్పటి కైన ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మామిడి విజరు కుమార్‌, కొర్ర భీమన్న, రాపా రాజారావు, పి.రాజారావు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

➡️