కాఫీకి గిట్టుబాటు ధర

Oct 8,2024 00:36
మాట్లాడుతున్న జిసిసి మేనేజర్‌

ప్రజాశక్తి-హుకుంపేట: మండలంలోని తాడిపుట్టు గ్రామపంచాయతీ గడుగుపల్లి గ్రామంలో కాపీ రైతులకు అవగాహన సదస్సును సోమేలి లక్ష్మయ్య ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. జిసిసి ఎంఎస్‌ మేనేజర్‌ బుక్క వెంకటేశ్వరరావు, కాఫీ బోర్డు అకౌంటెంట్‌ సుగంధర్‌ పాల్గొన్నారు. అనంతరం జిసిసి మేనేజర్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, దళారిలతో మోసపోవద్దన్నారు.కాఫీ గింజలు నాణ్యత పై రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు జిసిసి సన్నద్ధం చేస్తుందని ఆయన అన్నారు. కాపీ పండ్లను సేకరించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఐటీడీఏ ప్రాజెక్టు, కాపీ బోర్డు అందించే కాపీ, మిరియాల మొక్కలను అందించడం, సబ్సిడీ రుణాలు, చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు, కాఫీ కల్లాలు, పల్పర్‌ మిషన్లు ప్రభుత్వం అందించి ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిసిసి సేల్స్‌ మెన్లు శ్రీదేవి, కళావతి పాల్గొన్నారు.

➡️