ప్రజాశక్తి-రంపచోడవరం : సబ్ డివిజన్ డీఎస్పీగా జి సాయి ప్రశాంత్ గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు.2022 ఏపీపీఎస్ బ్యాచ్ కు చెందిన జి సాయి ప్రశాంత్ గ్రేహౌండ్స్ లో పనిచేసే రంపచోడవరం డిఎస్పీగా బదిలీపై వచ్చారు. రంపచోడవరం డివిజన్ కు చెందిన సిఐలు ఎస్సైలు ఆయన్ని గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్నాయి. గంజాయి అక్రమ రవాణాలను అరికట్టేందుకు తను శాయశక్తుల ప్రయత్నిస్తానని గంజాయి అక్రమ రవాణా చేసిన అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లోని పర్యాటక పర్యాటకులు అధికంగా వస్తున్నారని అయితే వారు మద్యం సేవించి వాహనాలను నడపడం, ప్రమాదాలకు గురికావడం జరుగుతుందని పర్యాటకులు పర్యాటక ప్రదేశాలను సందర్శించి క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా ఉండాలని అన్నారు. ప్రజలు కూడా ఎటువంటి సమాచారం ఉన్న నేరుగా పోలీసు శాఖ వారికి తెలియజేయవచ్చని తెలిపారు. తాము కూడా ప్రజల్లో మమేకమైనందుకు ఫ్రెండ్లీ పోలీసు కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.