ఆరోగ్య కార్డులు పొందేలా చర్యలు

Nov 28,2024 00:10
రికార్డులు పరిశీలిస్తున్న జెసి అభిషేక్‌ గౌడ్‌

ప్రజాశక్తి-చింతపల్లి:స్థానిక ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని,అల్లూరి జిల్లాలో 60 శాతం మంది గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు లేవని, అందరు కార్డులు పొందేలా చర్యలు తీసుకుంటామని పాడేరు జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ్‌ తెలిపారు. బుధవారం చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలపై ఆసుపత్రి సిబ్బందిని విచారించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని, త్వరలో భర్తీ చేస్తామన్నారు. అధిక శాతం గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు లేవని, దీనిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో జరుగుతున్న పలు విషయాలపై ఫిర్యాదులు వచ్చాయని, సిబ్బందితో మాట్లాడి విచారణ నిర్వహించామన్నారు. నివేదికను జిల్లా కలెక్టరుకు అందజేస్తానన్నారు.

➡️