విద్యార్థుల చదువులు!

బురదనేలపై కూర్చుని టార్పాలిన్‌ కింద చదువుతున్న విద్యార్థులు

ప్రజాశక్తి-అనంతగిరి:చదువుకోవడానికి కనీస పాఠశాల భవనం లేక వర్షానికి విద్యార్థులు తార్పాలిన్‌ కట్టి బురధ నేలపై కూర్చుని చదువుకోవాల్సిన దుస్థితి గిరిజన పేద విద్యార్థులకు నెలకొంది. మండలంలోని నాన్‌ షెడ్యూల్‌ రొంపల్లి పంచాయతీ పరిధి బూరిగ ఎంపీపీ పాఠశాలలో చిన్నకొన్నెల , బూరిగ గ్రామాలకు చెందిన 35 మంది విద్యార్థులు విద్యను అభ్యశిస్తున్నారు. పాఠశాల మంజూరైనప్పటి నుండి నేటి వరకు ప్రభుత్వం ఎటువంటి పాఠశాల భవనం మంజూరు చేయ లేదు. దీంతో, విద్యార్థులు ఎండాకాలంలో చింతాచెట్టు కింద, వర్షాకాలంలో తార్పాన్‌ కట్టి కటిక బురద నేలపై కూర్చొని విద్యా బోధన కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా పాఠశాల నిర్మాణానికి 2012 సంవత్సరంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా పునాది నిర్మించి వదిలి వేశారు. దీంతో విద్యార్థులకు కనీస భవనం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌, పిఒ లకు లిఖితపూర్వకంగా విన్నవించిన్నా పట్టించుకోనె నాదుడే కరువుయ్యారు. ఇప్పటికైనా ఉమ్మడి కూటమి ప్రభుత్వం స్పందించి పాఠశాల భవనం నిర్మించాలని వార్డు మెంబర్‌ ఎస్‌.అప్పాలరాజు, తల్లి తండ్రులు బి.పెంటయ్య, కె.సింహాచలం, తదితరులు కోరారు.

➡️