రూ.10వేల పింఛను అందజేత

Feb 2,2025 00:28
పింఛను అందజేస్తున్న సర్పంచ్‌

ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని సూకూరు పంచాయతీ చట్రాయిపుట్టు గ్రామంలో సికిల్‌ సెల్‌ ఎనిమియా బాధితుడు గొల్లోరి కృష్ణకు నూతన పెన్షన్‌ రూ.10000 శనివారం స్థానిక సర్పంచ్‌ సత్యవతి చేతుల మీదుగా అందజేశారు.అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్‌తో మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రతినెలా వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యం పట్ల తగు జాగ్రతలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ధనసాని మురళి, పూర్ణ, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ కృష్ణ, ఆశ కార్యకర్త బృంద, వాలెంటీర్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️